మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వైద్య సిబ్బందికి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఆమె మహబూబాబాద్, గంగారం మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.