ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ చేతుల మీదుగా చల్లదనం, ఉపశమనం

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆధ్వర్యంలో, మండుతున్న ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం కలిగించేలా నెహ్రూ సెంటర్ ట్రాఫిక్ పోస్ట్ వద్ద వాటర్ మిస్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ సిస్టమ్ ద్వారా చల్లదనం లభించి సిబ్బందికి ఉపశమనం కలుగుతోంది. అలాగే, మిల్టన్ వాటర్ ఫ్లాస్క్స్, కూలింగ్ గాగుల్స్‌ను కూడా పంపిణీ చేశారు. వేసవిలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతిరావు, సీఐ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్