ములుగు మున్సిపాలిటీ ఎన్నికల తుది బరిలో 83 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం, ఎన్నికల అధికారులు మంగళవారం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 159 నామినేషన్లు పరిశీలనకు రాగా, 76 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా 7వ వార్డులో ఏడుగురు, 9వ వార్డులో ఎనిమిది మంది, 11, 19వ వార్డుల్లో ఆరుగురు చొప్పున అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తుది బరిలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు.