మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఉన్నతాధికారుల బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా, అధికారులు ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప ఆలయం, సరస్సు ప్రదేశాలను సందర్శించారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. పద్మకోట కీర్తి తోరణం, ఏకశిల గుట్టలోని స్వయంభూ దేవాలయాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది.