ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ములుగు పీహెచ్సి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు హంస హోమియోపతి కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ములుగు పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. దీప్తి ఎయిడ్స్ నివారణ చర్యలను వివరించారు. అనంతరం గ్రామ సచివాలయం నుండి విద్యార్థుల నినాదాలతో ర్యాలీ ముందుకు సాగింది. ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధి సంక్రమణ, లక్షణాలు, చికిత్స, నివారణపై నాటక రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ అక్కలదేవి, డాక్టర్ పద్మజ అక్కలదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ సూరుస్ సాహెర్ ఖాన్, వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ బాబు కత్తి, డాక్టర్ బిందు మాధవి, డాక్టర్ పుష్పలత, డాక్టర్ అదిబా సైద్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్