ములుగు జిల్లా ఏటూరునాగారంలో సోమవారం ఆదివాసిలు ఐటీడీఏ కార్యాలయం భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఐటీడీఏ ద్వారా ఆదివాసీలకు చెందాల్సిన అభివృద్ది ఫలాలు, ఉద్యోగాల విషయంలో అధికారుల అవకతకలు జరిగాయని ఆరోపించారు. అవకతవకలకు పాల్పడుతున్న డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు.