ములుగు మండలంలోని లక్ష్మీదేవిపేటలో సుమారు రూ. 2కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా గత 4 నెలలుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. తవ్విన గుంతలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.