ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి సోమవారం 75 ఫిర్యాదులు వచ్చాయన్నారు. గృహనిర్మాణ శాఖకు 30, భూసమస్యలు 25, ఉపాధి కల్పనకు 2, పెన్షన్ 3, ఇతర శాఖలకు చెందిన 15 ఫిర్యాదులు అందయన్నారు. వచ్చిన పిర్యాదు లను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.