మేడారం గద్దెల నిర్మాణంలో పొరపాట్లు వద్దు: కలెక్టర్

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో రాతి నిర్మాణాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్స్, స్తూపం వద్ద సర్కిల్ సుందరీకరణ పనులను కూడా పరిశీలించి, జాతర సమీపిస్తున్నందున భక్తులకు ఆటంకం కలగకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్