ప్రాణాలకు రక్షణ కల్పించే రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ములుగు ఎస్సై ఉపేందర్ రావు అన్నారు. ఆదివారం ములుగులో 'ఎరైవ్ - ఎలైవ్' కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రయోజనాలను వివరించారు. మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదాలు జరుగుతాయని, అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.