వసతి గృహంలో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం సాయంత్రం నర్సంపేటలోని ప్రభుత్వ బిసి కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్