దుగ్గొండి: కుళ్లిన కూరగాయలతో వంటలా అంటూ కలెక్టర్ ఆగ్రహం

జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో వంట గదిని పరిశీలించారు. కుళ్లిన కూరగాయలు, వాసన వస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను చూసి నిర్వాహకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు అందించే ఆహరం ఈ విధంగా చేస్తే ఎలా తింటారని మందలించారు.

సంబంధిత పోస్ట్