ఓపెన్ జిమ్ లో పనిచేయని పరికరాలు

వరంగల్ జిల్లా నర్సంపేటలోని వల్లబ్ నగర్ మినీ స్టేడియంలోని ఓపెన్ జిమ్ లో గత కొన్ని నెలలుగా ఒకటి రెండు మినహా మిగతా పరికరాలు పనిచేయడం లేదు. సగం విరిగిన, పూర్తిగా ధ్వంసమైన పరికరాలు కనిపిస్తున్నాయి. జిమ్ మ్యాట్ కూడా ధ్వంసమైంది. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి పరికరాలను బాగు చేయించాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య వల్ల స్టేడియంకు వచ్చే వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్