కోనాపురం గ్రామ కార్యదర్శికి ఘన సన్మానం

ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేటలోని చెన్నారావుపేట మండలం, కోనాపురం గ్రామ కార్యదర్శి షేక్ సాహిద్ పాషాను ఆదివారం గ్రామస్తులు, సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి శాలువాతో సత్కరించారు. శనివారం చెన్నారావుపేట మండల కేంద్రంలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న పాషాకు ఈ గౌరవం దక్కడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైదం రాకేష్, ఉప సర్పంచ్ మండల నరసింహారావులు, జిపిఓ బిక్షపతి, వార్డు సభ్యులు పోతురాజు లిట్టు, ఉప్పునుతుల లింగమూర్తి చారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్