ప్రజా-పాలన ప్రగతి-ప్రణాళిక ముగింపు సమావేశం సందర్భంగా, జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న ఎర్రబోయిన రాజశేఖర్ ను జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా అటవీశాఖ అధికారిణి నికిత, అడిషనల్ కలెక్టర్ వై. వి. గణేష్ లు కలెక్టరేట్ లో అభినందించి శనివారం సన్మానించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మానవ మనుగడ రక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.