రాయపర్తి పోలీస్ స్టేషన్ ను బుధవారం వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రాయపర్తి స్టేషన్ ను తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. పోలీసే స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాన్ని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ షార్పుద్దీన్ ఏఎస్సైగా ప్రమోహన్ పొందగా ఏసీసీ అతన్ని అభినందించారు.