జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి విస్నూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై కుళ్లిన వ్యర్థాల మూటలు పేరుకుపోయాయి. వీటిలో జంతువుల కబేలా, కోళ్ల వ్యర్థాలు, చెత్తాచెదారం ఉండటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసనతో నిండిపోయింది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యర్థాల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.