పాలకుర్తికి కార్యాలయం దూరం.. అన్నదాతల అవస్థలు

జనగామ జిల్లా పాలకుర్తిలోని నీటిపారుదల శాఖ కార్యాలయం హనుమకొండకు తరలిపోవడంతో రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల, పాలకుర్తి మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు భవనాలకు అద్దెలు చెల్లించవద్దని ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఈ మార్పు జరిగింది. దీంతో చిన్న పని కోసం కూడా రైతులు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

సంబంధిత పోస్ట్