విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ నుండి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెంపు, సాంకేతిక విద్యా, విద్యా నాణ్యత మెరుగుదల లక్ష్యంగా అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా విద్యా శాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి గోపాల్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి పలు కీలక అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్