ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్వోసీని ఇవ్వాలి

హనుమకొండ జిల్లాలో కలర్, బ్లాక్ గ్రానైట్, కంకర ఖనిజ బ్లాకులకు సంబంధించిన ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసి)ని ఇవ్వాలని సంబంధిత అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్, సాగునీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి, తదితర ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖనిజాల వెలికితీతకు అనుమతులు, నిబంధనల అమలుపై చర్చించారు.

సంబంధిత పోస్ట్