వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ రవి మాట్లాడుతూ, పదవీ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలని సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్లు రాజయ్య, జైపాల్, ఆర్. ఎస్ఐ యాదయ్య, ఏఎస్ఐలు దాసరయ్య, బుచ్చయ్య, గోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నరహరి వంటి వారు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని ఆయన కొనియాడారు.