వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి బుధవారం ఎంజీఎం ఆసుపత్రి లో సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహందాస్ తో పాలియేటివ్ కేర్ సేవల వివరాలను పోర్టల్లో నమోదు చేయడంపై చర్చించారు. అనంతరం వరంగల్ అదనపు కలెక్టర్ వై. వి. గణేష్ తో కలిసి వరంగల్ సీకేఎం ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవల మెరుగుదలపై ఆసుపత్రి ఆర్ఎంఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ
అవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవాలు నిర్వహిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు.