వరంగల్: ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలి: కలెక్టర్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపు ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్ సత్యశారద దేవి ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్అండ్ బీ అధికారులు, వైద్యాధికారులతో కలిసి బుధవారం ఆసుపత్రిని సందర్శించారు. క్షేత్ర స్థాయిలో నిర్మాణంలో ఉన్న గదులు వాటిలో ఏర్పాటు చేయాల్సిన వసతులను అడిగారు.

సంబంధిత పోస్ట్