వరంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గ్రేటర్ వరంగల్ లో పర్యటించనున్నారు. సమ్మయ్యనగర్, పోతాననగర్, రంగంపేటలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడనున్నారు. హుస్నాబాద్, వరంగల్ లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:45కు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుని, అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో మూడు కాలనీలలో పర్యటిస్తారు. 3 గంటలకు హన్మకొండ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించి, 4 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

సంబంధిత పోస్ట్