ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్

హనుమకొండ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని కలెక్టరేట్ కార్యాలయ వివిధ విభాగాలు, మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక శాఖ, భూసర్వే మరియు కొలతల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఖజానా శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా పరిశ్రమల కేంద్రం, పౌర సరఫరాల శాఖ, ఈ-డిస్ట్రిక్ట్ విభాగం, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పరిపాలన విభాగ తదితర కార్యాలయాలను ఆమె సందర్శించారు. ఈ ఆకస్మిక తనిఖీతో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్