ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవల తీరును పరిశీలించారు. ఓపీ కౌంటర్లు, రిజిస్టర్ల నిర్వహణ, ఫార్మసీలోని ఔషధాల నిల్వలు, పంపిణీ విధానాన్ని సమీక్షించారు. లేబర్ రూమ్, వార్డులు, ఇతర విభాగాలను సందర్శించి, కొన్ని వార్డుల్లో స్వల్పంగా శుభ్రత లోపం గమనించి, ప్రమాణాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్