నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, నగరంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్ళిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, కేయూ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, కేయూసీ సీఐ రవి కుమార్ కూడా పాల్గొన్నారు.