నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ భవనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం నుండి వరంగల్ రేంజ్ పోలీస్ అధికారులకు సంబంధించిన పరిపాలన కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీపీ కార్యాలయంలోని సదుపాయాలను పరిశీలించి, పోలీస్ అధికారుల శాఖపరమైన సమస్యలపై రెంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు.