సంగెం మండల కేంద్రంలోని KGVB విద్యాలయంలో శుక్రవారం కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వంట సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు నిర్లక్ష్యం వహించడాన్ని గమనించి కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఆదేశించారు.