ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అప్పయ్య బుధవారం జిల్లాలోని వంగర, ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఫార్మసీ మందుల నిల్వలు, ల్యాబొరేటరీ రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు, సాధారణ టీకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕