గర్భిణుల నమోదు ప్రక్రియను పరిశీలించిన డిఎంహెచ్ఓ

హన్మకొండ జిల్లా పరిధిలో గర్భిణుల ముందస్తు నమోదు శాతం గట్లకానపర్తి ఉప కేంద్రంలో గత 3 నెలలుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మంగళవారం శ్యాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గట్లకానపర్తి గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గర్భిణుల నమోదు స్థితిగతులను పరిశీలించి, ఇప్పటివరకు ఎంతమంది గర్భిణులు నమోదు అయ్యారు, ఇంకా ఎంతమంది నమోదు కావాల్సి ఉందనే వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల గుర్తింపు, ముందస్తు నమోదు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕