హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, 56వ డివిజన్ గాయత్రి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గాయత్రి కాలనీ నివాసితులు మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రాథమిక వసతుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.