కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై రేపు(బుధవారం) హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు రానుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, స్మితాసబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగియగా తీర్పు రిజర్వు చేసింది. రేపు తీర్పును వెల్లడించనుంది.