పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హాస్టళ్లు

వరంగల్ నగరంలో ప్రైవేట్ హాస్టళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ హాస్టళ్లు, నివాసితులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అద్దెకు గదులు దొరికితే చాలు, కొందరు హాస్టల్ పేరుతో వ్యాపారం నడుపుతున్నారు. హాస్టల్ నివాసితులు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో పర్యవేక్షణ లేకుండా, నెలనెలా డబ్బులు వసూలు చేసుకుంటున్నాయని కొన్ని హాస్టల్ యాజమాన్యాలపై ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్