భవనాల తొలగింపై సమీక్ష జరిపిన పోలీస్ కమిషనర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరిసరాల్లోని పాత భవనాలను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంబంధిత అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఈ పాత భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను తరలించాల్సి వస్తే, సంబంధిత విభాగాల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు సురేంద్ర, అంతయ్య, ఆర్.ఐలు శ్రీధర్, సతీష్, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్