గోపాల్ పూర్ లో రోడ్డు ఆక్రమణల తొలగింపు

హన్మకొండలోని గోపాల్‌పూర్, దేవరాజ్ కాలనీ, శివ సాయి కాలనీలలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన వినాయక మండపాలను మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కాజీపేట సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని ఇన్చార్జ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశాంత్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్