పూర్తి స్థాయి కమిషనర్ లేని వరంగల్ బల్దియాలో నేటి నుంచి పాలకమండలి కూడా ఉండదు. కార్పొరేషన్ పాలకమండలి గడువు ముగియడంతో కార్పొరేటర్లు మాజీలు అయ్యారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడంలేదు. దీంతో జీడబ్ల్యూఎంసీలో నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. రెండు నెలలకు పైగా జీడబ్ల్యూఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేరు. గతంలో కమిషనర్‌గా పనిచేసిన చాహత్ బాజ్‌పాయ్‌ను ప్రభుత్వం ఫిబ్రవరిలో హనుమకొండ కలెక్టర్‌గా నియమించింది.