పదవీవిరమణ అనంతరం కుటుంబ సభ్యులతో గడపండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులను కమిషనర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్లు సిద్ధయ్య, సాంబారెడ్డి, కనకచంద్రం, సయ్యద్ చాంద్ పాషా, లింగారెడ్డి, రాజు, ఆర్. ఎస్సై మహమూద్, ఏ. ఆర్. ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, రాములు ఈ సన్మానం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్