ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఈ నెల 4, 6, 8, 10, 12 తేదీలలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.