వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. "Arrive Alive" కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.