వరంగల్ ఎంజీఎం అభివృద్ధి కమిటీ సమావేశం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మౌలిక వసతులు, సిబ్బంది కొరత, వైద్య పరికరాల అవసరాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్, నర్సింగ్ పాఠశాల భవనం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన ఎంజీఎం అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్