నేడు హనుమకొండ పరిధిలో నీటి సరఫరా బంద్

హనుమకొండ పరిధిలోని అశోక జంక్షన్ వద్ద నీటి లీకేజీలకు మరమ్మత్తు పనులు జరుగుతున్నందున, ఆదివారం నాడు ఆయా ప్రాంతాలలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు బల్దియా ఈఈ రవి కుమార్ తెలిపారు. కుమార్ పల్లి మార్కెట్, రెడ్డి కాలనీ, గుడి బండల్, మంగళి వాడ, రాయపుర, సుధా నగర్, మచిలీ బజార్, కాపు వాడ, కాకతీయ కాలనీ ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని, స్థానిక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్