భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా, సమీపంలోని చెరబండరాజు కాలనీ వాసుల గుడిసెలు, ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ కో ఉన్నప్పటికీ మున్సిపల్, కుడా అధికారులు కూల్చివేతలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో గుడిసెవాసులకు పట్టాలు అందజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేతలతో ఆందోళనకు గురిచేస్తోందని కాలనీవాసులు పేర్కొన్నారు. అధికారులు కూల్చివేతలు ఆపకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.