వరంగల్ ఎనుమాముల మార్కెట్ సెక్రటరీగా నిషాని శ్రీనివాస్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా నిషాని శ్రీనివాస్ నియమితులయ్యారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీలకు ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. షాద్ నగర్ మార్కెట్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్ ను వరంగల్ మార్కెట్ కు బదిలీ చేశారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు చూసిన మల్లేశం జమ్మికుంట మార్కెట్ కు వెళ్లారు. శ్రీనివాస్ రాకతో మార్కెట్ పాలన బలోపేతం కానుంది.

సంబంధిత పోస్ట్