వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్ అండ్ బి ఇఇతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.