గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈరోజు సోమవారం (జులై 14, 2025) ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నగర ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌కు అందజేశారు. ప్రజల ఫిర్యాదులపై సంబంధిత శాఖలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.