మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ సెలవు దినాన, అది కూడా జాతర వేళ, విజిలెన్స్ అధికారులు మార్కెట్ ను సందర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రైతులు, వ్యాపారులు మార్కెట్ కు రారని తెలిసినా అధికారులు అక్కడికి వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది.