తాగిన మత్తులో ఏం చేశాడో చూడండి (వీడియో)

మద్యం మత్తులో కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా యూపీలోని లక్నోలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తన తలను ఓ వంతెనపై రెయిలింగ్‌లో పెట్టాడు. అనంతరం తలను బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడి అవస్థలను చూసి అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు స్పందించారు. రెయిలింగ్ నుంచి బయటకు లాగి అతడిని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.