'పానీ' పేరుతో జలమండలి ప్రత్యేక యాప్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌లో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘పానీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా ప్రజలు ‘సేవ్‌ వాటర్‌ వలంటీర్లుగా’ నమోదు చేసుకుని నీటి వృథాపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జరిమానాలు విధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, నీటి పొదుపుపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕