జల వివాదంపై చర్చకు ఆహ్వానిస్తూ కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాల సీఎంలకు సర్క్యులర్ జారీ చేసింది. జులై 16న ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావాలని కేంద్రం కోరింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని పేర్కొంది. మరోవైపు కృష్ణా, గోదావరి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.